హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటెల్ ఆస్పత్రిలో సోమవారం నుంచి చికిత్స పొందుతూ (మంగళవారం) ఈరోజు వేకువాజామున 4 గంటలకు మృతి చెందారు.సోమవారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ కు తరలించారు.ఆసుపత్రికి చేరుకునేటప్పటికి, కృష్ణ పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించి,ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందించారు.24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు నిన్ననే ప్రకటించారు.