హైదరాబద్: సూపర్ స్టార్ కృష్ణ(79) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ వైద్యులు మీడియాకు విడుదల చేసిన బుల్లెటన్ తెలిపారు..48 గంటల వరకు ఏమీ చెప్పలేమని ప్రకటించారు..సోమవారం వేకువజామున 2 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు..కార్డియాక్ అరెస్ట్ తో గురైన కృష్ణను ఆసుపత్రికి తీసుకుని వచ్చరని,వెంటనే అయనకు సీపీఆర్ చేశామన్నారు. కార్డియాక్ అరెస్టుకు పలు కారణాలు ఉంటాయని, ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారని వెల్లడించారు.శరీరం సహకరిస్తుందా..? లేదా అనేది ఊహించి చెప్పలేమని, మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కాంటినెంటల్ వైద్యులు స్పష్టం చేశారు..సమాచారం అందుకున్న హీరో మహేష్ ఆసుపత్రికి చేరుకున్నారు.
వేకువజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తడంతో కృష్ణను ఆయన కుటుంబ సభ్యలు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కృష్ణకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ట్రీట్మెంట్ ప్రారంభించిన వైద్యులు, ఉదయానికి కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని, శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేర్చామని, 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేస్తారని నరేశ్ మీడియాకు వెల్లడించారు.