నుపుర్ హత్యకు..పాకీస్తానీ..
అమరావతి: టీవీ డిబెట్ లో ఒక మతంపై అనుచిత వ్యాఖ్యల కేసులో భాజపా మాజీ నేత నుపుర్ శర్మపై ఆగస్టు 10వ తేది వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది..తనను రేప్ చేస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నయని, ప్రాణహాని ఉందన్న నుపుర్ శర్మ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సూర్యకాంత్,,జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం,, ఆమెకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ,, భవిష్యత్తులో నమోదయ్యే కేసుల విషయంలోనూ ఈ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది..
నుపుర్ హత్యకు..పాకీస్తానీ..నూపుర్ శర్మను చంపేందుకు రిజ్వాన్ అష్రఫ్ అనే ఓ పాక్ జాతీయుడు అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చాడు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా హిందూమల్‌కోట్ వద్ద సరిహద్దు దాటి అనుమానాస్పదంగా సంచరిస్తోన్న రిజ్వాన్‌ను ఈ నెల 16వ తేదిన,BSF గస్తీ దళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు..అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరో(IB),,రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(RAW) మిలిటరీ ఏజెన్సీ అధికారులు సంయుక్తంగా ఇంటరాగేషన్ మొదలు పెట్టారు..రిజ్వాన్ వద్ద ఉన్న సంచిలోనుంచి 11 అంగుళాల కత్తిని,,మతపరమైన సాహిత్యాన్ని,,మ్యాపులను,,ఆహార పదార్ధాలు,,దుస్తులను స్వాధీనం చేసుకున్నారు..ఉత్తర పాకిస్థాన్‌లోని మండి బహవుద్దీన్ నగరానికి చెందిన రిజ్వాన్ నూపర్ శర్మను చంపేందుకు సరిహద్దు దాటినట్లు ఇంటరాగేషన్‌లో తెలిపాడు..అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లాక తన కుట్రను అమలు చేసేందుకు మార్గాలు వెతకాలనుకున్నట్లు వెల్లడించాడు.. BSF అధికారులు రిజ్వాన్‌ను రాజస్థాన్ పోలీసులకు అప్పగించారు..వారు రిజ్వాన్‌ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా,,కోర్టు అతడిని 8 రోజుల పోలీస్ రిమాండ్‌కు అనుమతించింది..నూపుర్ శర్మకు చంపేందుకు రిజ్వాన్ భారత్‌లో ఎవరి సాయం తీసుకోవాలనుకున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..