సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలి-పేరెంట్స్ అసోసియేషన్

నెల్లూరు: ప్రైవేటు విద్యాసంస్థలలో వరస గా జరుగుతున్న లైంగిక దాడులు, విద్యాబోధన, అధిక ఫీజు వసూలు పేరుతో అత్యంత కర్కసంగా విద్యార్థుల జరుగుతున్న దాడుల ఘటనలపై, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ,విద్యార్థి, తల్లిదండ్రులతో ,కలెక్టర్,ఎస్పీ,డి.ఈ.ఓలు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్,విద్యార్థి తల్లిదండ్రులకు” భరోసా, అవగాహన సదస్సు సమావేశం నిర్వహించాలని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను, విద్య హక్కు చట్టం 2009, నియమా, నిబంధనలను అన్ని ప్రాథమిక ,ప్రాథమికోన్నత ,ఉన్నత విద్యాసంస్థలలో కఠినంగా అమలు చేసేల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రైవేటు విద్యాసంస్థలలో,జిల్లా ,మండల స్థాయిలో విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యాలు సిబ్బందితో కూడిన కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని, ప్రతి విద్యా సంస్థ నోటీసు బోర్డుపై విద్యా కమిటీ పేర్లు ఫోన్ నెంబర్లతో,రక్షణకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉంచే విధంగా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని, ఈ ప్రక్రియ పర్యవేక్షణకు విద్యాశాఖ ,పోలీస్ ,రెవెన్యూ సిబ్బందితో కూడిన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని యుద్ధ ప్రాతిపదికన అమలుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు.