మాజీ ప్రొఫెసర్ సాయిబాబా బెయిల్ పై స్టే విధించిన సుప్రీమ్

అమరావతి: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో నాలుగురు నిర్దోషులంటూ, బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ,,సుప్రీంకోర్టు శనివారం ఆదేశాలిచ్చింది. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై నేడు ప్రత్యేకంగా విచారణ జరిపిన జస్టిస్ M.R.షా, జస్టిస్ బేలా, M. త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణాన్ని చూపించి,, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడం సమంజసం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదించారు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు. UAPA చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడంపై సాయిబాబా ట్రయల్ కోర్టులో కానీ, ఇతర కోర్టుల్లో కానీ సవాల్ చేయలేదని తెలియచేశారు.సాయిబాబాను కస్టడీలోకి తీసుకున్న తరువాత ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేశారని, అయితే ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు కోర్టు తిరస్కరించిందని తెలిపారు. తదుపరి విచారణ కోసం నోటీసులు జారీ చేస్తామని సుప్రీమ్ కోర్టు పేర్కొంది.