మత మార్పిళ్లపై సుప్రీం హెచ్చరిక, రంగంలోకి దిగాలని కేంద్రానికి ఆదేశం

అమరావతి: మోసపూరితంగా జరుగుతున్న మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోకపోతే సమాజంలో అత్యంత తీవ్రమైన పరిస్థితులు పెచ్చరిల్లే అవకాశం వుందని జస్టిస్.ఎం.ఆర్.షా,,జస్టిస్.హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా బీజెపీ నేత,న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన సందర్బంలో ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.భాగస్వాములను ఆకర్షణకు గురిచేసి,బలవంతగతా మత మార్పిడి చేస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని,ఈ మత మార్పిడులను నివారించేందుకు నిజాయితీ చర్యలు అవసరమని,ఈ విషయంలో కేంద్రం రంగంలోకి దిగాలని స్పష్టం చేసింది.వీటి నివారణకు ఎలాంట చర్యలు తీసుకోవచ్చో ప్రతిపాదించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.దేశ భద్రతత పాటు మత స్వేచ్చ హక్కును ప్రభావితం చేసి తీవ్రమైన విషయమని,దినిపైన కేంద్రంకు స్పష్టమైన వైఖరి వుండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.