AMARAVATHIDISTRICTS

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్‌ చరణ్ ఆ తరువాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు.. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్,, రామ్ చరణ్,, సురేఖను ఆప్యాయంగా హత్తుకున్నారు.. జనసేన అధిపతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు..వీరి వెంట నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అనంతరం బయటకు వచ్చి జనసేన అభిమానులు, కార్యకర్తలకు కలిసి అభివాదం చేశారు..పవన్, రామ్ చరణ్ లను చూసి జనసేన అభిమానులు కేకలు, అరుపులతో హోరెత్తించారు..పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కోరారు.. చిరంజీవి వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్ ‘మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *