నెల్లూరు: ఈనెల 28వ తేదిన నెల్లూరు రూరల్ పరిధిలోని ఆశోక్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు..గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిలోకి చొరబడి భార్యాభర్తలను దారుణంగా హతమార్చిన ఘటన చోటుకుంది..వాసిరెడ్డి.కృష్ణారావు కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద శ్రీరామా క్యాంటిన్ నడుపుతున్నాడు.క్యాంటీన్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్న శివకుమార్,అతని బంధువు అయిన రామకృష్ణాలు ఈ హత్యలు చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు.పోలీసు పేరేడ్ గ్రౌండ్స్ లోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ శివకుమార్ 2011 నుంచి కృష్ణారావు వద్ద సప్లయర్ గా పనిచేస్తున్నడని,,ఇతనిపై నమ్మకంతో కృష్ణారావు,,శివకుమార్ చేత అప్పుడప్పుడు కౌంటర్ లో వచ్చిన క్యాష్ ను లెక్కపెట్టించేవాడని చెప్పారు.క్యాష్ లెక్కపెడుతున్న సమయంలో శివకుమార్ లో దుర్భుద్దిపుట్టిందన్నారు..ఇదే సమయంలో క్యాంటీన్ కు కస్టమర్స్ వచ్చినప్పుడు,శివకుమార్ సరిగా పనిచేయకపోతే,అతన్ని మందలించే వాడని,అందరి ముందు తిడుతున్నందుకు,శివ లోలోపలే కక్ష్య పెంచుకున్నాడని తెలిపారు.బంధువు రామకృష్ణ సహాయంతో కృష్ణారావు ఇంటి వద్ద చేరుకున్న వీళ్లు,,భార్యభర్తలను హాత్య చేసి,రూ.లక్ష 60 వేల నగదులు తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నరన్నారు.ఏవరికి అనుమానం రాకుండా,ప్రక్క రోజు జరిగిన కృష్ణరావు అంత్యంక్రియాల్లో పాల్గొన్నరన్నారు.హంతకులను పట్టుకునేందుకు 5 టీమ్స్ ను రంగంలోకి దింపడం జరిగిందన్నారు..సి.సి టీవీ పుటేజ్,,ఘటన స్థలంలో దొరికి ఎవిడెన్స్ ఆధారంగా ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.