అమరావతి: ప్రధానమంత్రి నేరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం అనంతరం కలుసుకున్నారు..దిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు..సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించారు..అనంతరం ఇద్దరూ కాస్త పక్కకు వెళ్లి సుమారు 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు..అయితే చంద్రబాబుతో మోదీ ప్రత్యేకంగా చర్చించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.. 2019 ఎన్నికల సమయం నుంచి ఇరు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు..మళ్లీ ఇన్నేళ్లకు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం విశేషం.