ఉపాధ్యాయ దినోత్సవం బహిష్కరణ-APTF

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు APTF ప్రకటించింది. ఈనెల 5వ తేదిన ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలకు ఏపీ టీచర్స్ ఫెరడేషన్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది..ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నమని,,అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరగణిస్తున్నామని పేర్కొంది.. సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి తేవడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. సీపీఎస్ రద్దు హామీపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారని APTF నాయకులు అవేదన వ్యక్తం చేశారు.