తెలంగాణ సీ.ఎస్,సోమేష్, ఏ.పిలో రిపొర్టు చేయాల్సిందే-హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ను కేంద్రం మంగళవారం రిలీవ్ చేసింది..హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేడర్ నుంచి తప్పించిన కేంద్రం,ఆయనను ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..ఈ నెల 12వ తేది లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని సోమేశ్ కుమార్ను ఆదేశించింది.. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఆంధ్రకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది..హైకోర్టు తీర్పుతో, సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు..రాష్ట్ర విభజన సమయంలో IAS,IPS అధికారులను కూడా DOPT రెండు రాష్ట్రాలకు కేటాయించింది..సోమేశ్ కుమార్కు ఏపీ కేడర్ అలాట్ చేసింది..అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ తెలిపారు..తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు..ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్,, సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది..2017లో కేంద్రం, క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది.. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు సోమేశ్ను ఏపీ కేడర్కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.