తెలంగాణ కాంగ్రెస్ మాజీ కేంద్ర,రాష్ట్ర మంత్రులకు ఈడీ నోటీలు

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ (యంగ్ ఇండియన్ లిబిటెడ్ కంపెనీ) కేసులో కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ,,సుదర్శన్ రెడ్డి,, గీతారెడ్డిలకు అక్టోబర్ 10న విచారణకు రావాలని మనీలాండరింగ్ యాక్ట్ 50 క్రింద ఈడీ నోటీసులు జారీ చేసింది..నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే..నేషనల్ హెరాల్డ్ కేసులో తనకు ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు..అయితే పత్రిక నడపడానికి కొంత ఫండ్ మాత్రం తాను ఇచ్చానని షబ్బీర్ అలీ అంగీకరించారు..ఈడీ నోటీసులు వస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. యంగ్ ఇండియన్ లిబిటెడ్ కంపెనీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు.