తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం ఉదయం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ఫలితాలు విడుదల చేశారు..ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పోలు లోహిత్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కా సాయి దీప్తిక రెండో ర్యాంకు, పొలిశెట్టి కార్తికేయ, పల్లి జయలక్ష్మి, ఎం. హిమవంశి తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు..అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో జుతూరి నేహ మొదటి ర్యాంకు సాధించగా, వీ.రోహిత్ రెండో ర్యాంకు, కే.తరూణ్ కుమార్ రెడ్డి, కే.మహీత్ అంజన్, జీ.శ్రీరామ్ తరువాత స్థానాల్లో నిలిచారు..అభ్యర్థులు ఎంసెట్ ఫలితాల కోసం https://eamcet.tsc-he.a-c.in, ఈసెట్ ఫలితాల కోసం https://ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు..మొత్తం 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు.