దశరా సెలవులను ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ

హైదరాబాద్: దశమి నవరాత్రులను (దసరా) పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు సెలవులుగా ప్రకటించింది..సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం కావడంతో మొత్తం 15 రోజులు సెలవులు ఉంటాయని పేర్కొంది..విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీన అంటే సోమవారం ప్రారంభం అవుతాయని విద్యా శాఖ స్పష్టం చేసింది.