రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం(12వ తేది) విడుదల కానున్నాయి.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నారు..ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11:45 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి..ఇంజినీరింగ్ ఎగ్జామ్ కు 1,56,812 మంది హాజరయ్యారు..80 వేల 575 మంది అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం పరీక్ష రాశారు.. ఎంసెట్ ఫలితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు..ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరిక్షీలను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుతల్లో నిర్వహించారు..అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు..