భారత్-చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఉద్రికత్త వాతావరణం

అమరావతి: భారత్ – చైనా సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు సమాచారం. డిసెంబరు 9వ తేదిన వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు దేశాలకు చెందిన కొంత మంది సైనికులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తొంది. ఎల్‌ఏసీ సమీపంలోకి చైనా సైనికులు చొచ్చుకు రావడంతో ఈ ఘర్షణ జరిగిందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి..ఈ నేపథ్యంలో సబంధిత ప్రాంతంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి,,ఇరు దేశాల సైన్యాలు అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్టు సమాచారం. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ తర్వాత ఇండియా,,చైనా బార్డర్ లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి.