x
Close
CRIME NATIONAL

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు ఉగ్రవాదుల కుట్ర,బీహార్ లో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు ఉగ్రవాదుల కుట్ర,బీహార్ లో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
  • PublishedJuly 14, 2022

2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష్యం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు కుట్ర పన్నుతూన్న ఉగ్రవాదులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు..2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని,, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని,,పాట్నా నగరంలోని నయా తోలా ప్రాంతంలో వున్న అనుమానిత ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్,, ఎండీ జలాలుద్దీన్ లను బీహార్ పోలీసులు జూలై 11వ తేదిన అరెస్టు చేశారు.. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందినట్లు దర్యాప్తులో బయటపడిందని ఫుల్వారీ షరీఫ్‌ ASP మనీష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు..జులై 6,7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహించారు..దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు..ఈ దాడిలో, పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు..వాటిలో ఒకటి 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ దేశం చేయాలనేది.వారి నుంచి 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంటెలిజెన్స్ బ్యూరోకు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. దింతో ఆప్రమత్తమైన  పోలీసులు, కేంద్ర సంస్థల అధికారులు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.. ఎండీ జలాలుద్దీన్ జార్ ఖండ్ పోలీసుశాఖలో పనిచేసిన రిటైర్ట్ అయినట్లు దర్యప్తులో తెలిందని అధికారి పేర్కొన్నారు..ఉగ్రవాద శిక్షణ:-కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని దర్యాప్తులో తేలిందని పోలీసుల తెలిపారు..అరెస్ట్ యిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని వెల్లడించారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.