విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఫిషింగ్ హార్బర్ ను కేంద్ర అభివృద్ది చేసింది-మురుగన్

నెల్లూరు: చేపలు సహా మత్స్య అనుబంధ రంగాల అహారం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర పశుసంవర్థక, మత్స్య, సమాచార ప్రసార శాఖల సహాయమంత్రి ఎల్.మురుగన్ తెలిపారు.అంత్యోదయ స్ఫూర్తి సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని,,ముఖ్యంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.ఆదివారం నెల్లూరులోని వి.ఆర్.సి. గ్రౌండ్స్ లో మత్స్యకార సహకార సమితి ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి మురుగన్ ప్రారంభించారు.అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, మత్స్య ఆహారం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.గత కొన్నేళ్ళలో మత్స్య ఎగుమతుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కృషి ప్రశంసనీయమైనదని, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 100 కోట్లతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.సబ్ కా సాత్… సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ గత 8 ఏళ్ళలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి కోసం 32 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు.ప్రపంచంలో మత్స్యపరిశ్రమ ఎగుమతుల్లో గత కొన్నేళ్ళలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది అనేందుకు నిదర్శనం, 30 శాతం మేర ఎగుమతులు పెరిగాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్ కే మకుటాయమానమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్,జిల్లాకు చెందిన పలువురు నాయకులు,అధికారులు పాల్గొన్నారు.