రబీ పంటలకు మద్దతూ ధరను పెంచిన కేంద్రం

అమరావతి: రబీ పంటలను పండిస్తూన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంగళవారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.మంత్రి తెలిపిన వివరాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ 6 రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పెంచిన మద్దతూ ధరల ప్రకారం క్వింటాలుకు గోధుమల ధర రూ.110, కుసుమల ధర రూ.209, కందులు (మసూర్) ధర రూ.500, ఆవాలు ధర రూ.400, శనగల ధర 105, బార్లీల ధర రూ.100 చొప్పున పెరిగింది.ధరల పెంపుతో గోధుమలకు మద్దతు ధర క్వింటాకు రూ.2125,,బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.1735,, ఆవాలు మద్దతు ధర క్వింటాకు రూ.5450 గా,, సన్ ఫ్లవర్ మద్దతు ధర క్వింటాకు రూ.5650 గా కేబినెట్ నిర్ణయించిందన్నారు.