మునుగోడు..
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ ను(నోటీఫికేషన్ అక్టొబరు 7వ తేది విడుదల) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.నవంబర్ 3వ తేదిన ఉప ఎన్నిక ఉంటుందని ప్రకటించింది. పార్టీల అభ్యర్థులు నామినేషన్లు అక్టోబర్ 14వ తేది వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 17వ తేది కాగా నవంబర్ 3వ తేదిన పోలింగ్,,నవంబర్ 6వ తేదిన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణ (మునుగోడు) తో పాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సారాష్ట్రల్లో పలు స్థానాల్లో బై పోల్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది.ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని,వ్యుహాలను సిద్దం చేసుకుంటున్నాయి.