కోడి కత్తి సంఘటనను గుర్తుకు వస్తొంది-పవన్ కళ్యాణ్

విశాఖ వదిలి వెళ్లాలి..
అమరావతి: మూడు నెలల క్రిందటే ఉత్తరాంధ్రాలో జనవాణి కార్యక్రమం ఖరారు అయిందని,రాజధానిపై జరుగుతున్న యాత్ర గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.అదివారం అయన విశాఖ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను ఎయిర్ పోర్టుకు వచ్చే సరికి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని,ఇందకు కారణం ఏవరంటూ ప్రభుత్వంను నిలదీశారు. ఎయిర్‌పోర్టులో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ పోలీసులు హత్యయత్నం కేసులు నమోదు చేసి అరెస్ట్ లు చేయడం ప్రజాస్వామ్యంకు మంచిదికాదన్నారు. వేకువజామున 3.30 గంటల సమయంలో తానతోపాటే బస చేసిన జనసేన నాయకులను హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దాదానె 500 వందలమంది పోలీసులు వచ్చి,,పదుల సంఖ్యలో తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారని వెల్లడించారు. నిన్న ఎయిర్ పోర్టు వద్ద జరిగిన సంఘటన, గతంలో ఇదే ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి ఘటనను గుర్తు చేస్తుందని పవన్ అన్నారు. వాళ్లే పొడిపించుకుని వాళ్లే హడావుడి చేశారని, నిన్న కూడా అలాగే చేశారేమో? అంటూ పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమానికి ముందే తమ జనవాణి కార్యక్రమం ఖరారైందని తెలిపారు. తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో, మేం ఎక్కడికి వెళ్లాలో కూడా వైసీపీ చెబుతుందా? మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు తమ దగ్గరికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు.
విశాఖను వదిలివెళ్లాలంటూ నోటీసులు: జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖకు పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్బంలో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నయని,మళ్లీ జనసేనాని ప్రజలోకి వస్తే,ఉద్రికత్త పరిస్థితులు ఏర్పాడే అవకాశం వుందని,ఈనెల 30వ తేది వరకు విశాఖపట్నంలో అన్ని రకాల ప్రదర్శనలు నిలిపివేయడం జరిగిందటూ ఏసిపి హర్షిత పవన్ కు నోటీసులు అందచేసింది.వెంటనే పవన్ కళ్యాణ్ విశాఖ విడిచి వెళ్లాలంటూ నోటీసుల్లో కోరినట్లు సమాచారం?