ఏపీ జెన్కోను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తానని సీ.ఎం ప్రకటించాలి

ఏపీ జెన్కో జెఏసి,పరిరక్షణ కమిటీ నిరసనలు..
నెల్లూరు: జన్కో మూడవ యూనిట్ ప్రారంభించి,అనంతరం మొత్తం మూడు యూనిట్లను కలిపి అదానీకి అప్పచేప్పేందుకు ముఖ్యమంత్రి ముత్తకూరు జన్కోకు వస్తున్నారని, ఏపీ జెన్కోను ప్రైవేటీకరిస్తూ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ఏపీ జెన్కో జేఏసీ,పరిరక్షణ కమిటీ నాయకులు మోహన్ రావు,కోటంరెడ్డి.శ్రీనివాసులరెడ్డిలు డిమాండ్ చేశారు.బుధవారం ముత్తుకూరు గేట్ సెంటర్లో నాయకులు ఈ నెల 27వ తేదీ ఏపీ జెన్కో 3వ యూనిట్ ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి గో బ్యాక్ అంటూ నిరసనలు చేపట్టారు.ఈ సందర్బంలో నాయకులు మాట్లాడుతూ ఏపీ జెన్కోను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తానని ప్రకటించి తరువాతే సీ.ఎం నెల్లూరుకు రావాలని, లేదంటే నెల్లూరులో పర్యటించే నైతిక హక్కును ముఖ్యమంత్రి కోల్పోతారని అన్నారు. నెల్లూరు నగరంలోనూ, ఏపీ జెన్కో, ముత్తుకూరు, అన్ని పట్టణాలు మండలాలో27వ తేదీ ఉదయం 9 గంటలకు సీఎం పర్యటనకు నిరసనగా ప్రదర్శనలు,ధర్నాలు,నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.