సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై ఆసంతృప్తిని వ్యక్తం చేసిన కమీషనర్

నెల్లూరు: జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్,అధికారులను నిలతీశారు.శుక్రవారం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆర్టీఏ యాక్ట్ వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అయినప్పటికి,ప్రజలు అడిగిన సమాచారం అందించడంలో అధికారులు ఆలసత్వం వహిస్తున్నరని అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1బి)లో పొందుపరిచిన 17 అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి జిల్లాస్థాయి ఆర్టీఐ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షులు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ASP శ్రీమతి హిమవతి,DRDA PD సాంబశివ రెడ్డి, DM&HO పెంచలయ్య,DPO శ్రీమతి ధనలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీ రాజ్ SE శివారెడ్డి, నెల్లూరు, కావలి RDOలు మలోల,శీనానాయక్, సమాచార శాఖ, సోషల్ వెల్ఫేర్ DDలు శ్రీమతి రమాదేవి,వెంకటేశ్వర ప్రసాద్, తాసిల్దార్లు, MPDOలు, పౌర సమాచార అధికారులు,RTA దరఖాస్తుదారులు పాల్గొన్నారు.