మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేసిన కోర్టు

అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ బెయిల్ రద్దు చేస్తు,నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆయనను చిత్తూరు తొమ్మిదవ ఆదనపు కోర్టు ఆదేశించింది.10వ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నారాయణకు గతంలో చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.సదరు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు కోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న తరువాత సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది.