అంబటిపై కేసు నమోదు చేయాలంటూ అదేశించిన కోర్టు

అమరావతి: అంబటి రాంబాబుకు కోర్టు షాక్ ఇస్తూ,,మంత్రిపై కేసు నమోదు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.. వైసీపీ నేతలు సత్తెనపల్లిలో సంక్రాంతి లాక్కీ డ్రా పేరుతో వేలకు వేలు టోకన్లు ముద్రించారు..టోకన్ల పైన ముఖ్యమంత్రి జగన్,,మంత్రి అంబటి.రాంబాబు,,ఎం.పీ లావు శ్రీకృష్ణదేవరాయుల ఫోటోలను ప్రింట్ వేయించారు..బహుమతులు పురుషులతో పాటు మహిళలు స్పెషల్ డైమండ్ నెక్లస్ గెలుచుకోవచ్చు అంటూ ప్రచారం హోరేత్తించారు..రూ.100 పెట్టి లాటరీ టిక్కెట్ కొంటే,,అంత కంటే ఎక్కేవే బహుమతిగా పొందవచ్చన్నారు..వైసీపీ నేతల ప్రచారం గమనించిన జనసేన నేతలు,రాష్ట్రంలో అనుమతి లేకుండా లాటరీ ఎలా నిర్వహిస్తారంటూ అంబటిపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..అంబటిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ససేమిరా అన్నారు..దింతో జిల్లా కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు,,లాటరీ టికెట్ల గురించి అంబటి చేసిన ప్రచార వీడియోను సమర్పించారు..విచారణ చేపట్టిన న్యాయస్థానం,,తక్షణమే అంబటిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించింది.