నెల్లూరు: ప్రక్క రాష్ట్రాల ప్రజలు, మీ రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అంటు ఎద్దేవా చేస్తున్నరని,ఇలాంటి దుస్థితి నెలకొనడానికి ప్రాంతీయపార్టీల ప్రభుత్వలే కారణం అంటు బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు చంద్రమౌళి మండిపడ్డారు.సోమవారం నెల్లూరు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశపాలన ఎండకడుతూ,బీజెపీ ప్రజాపోరు యాత్రను ప్రారంభమైందని అయన చెప్పారు.నగరంలోని ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పా.మె.ని.వర్గం అధ్యక్షడు భరత్ కుమార్,,బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు సురేంద్రరెడ్డి,సురేష్ రెడ్డి,మహిళ నేతలు,తదితరులు పాల్గొన్నారు.