NATIONAL

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభిషేక్,విజయ్ ల బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో బోయినపల్లి.అభిషేక్,, విజయ్ నాయర్ల బెయిల్ పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదికి వాయిదా వేసింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుని ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చగా, అభిషేక్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జైల్లో బుక్స్ , మందులు,చలికి తట్టుకునేందుకు ఉలెన్ బట్టలు అందచేయాలని జైలు అధికారులను  సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశించింది.మరో ముద్దాయి అయిన విజయ్ నాయర్ ని మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విజయ్ నాయర్ కు సంబంధించిన ల్యాప్ టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని,అందులోని డేటా రికవరీ జరుగుతుందని, ల్యాప్ టాప్ లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయని తెలిపారు.లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ ల్యాప్ టాప్ రిపోర్ట్ చాలా కీలకమని,ఇందులో 100 కోట్ల రూపాయిలు ఎలా చేతులు మారాయో తెలుస్తాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాప్ టాప్ రిపోర్టు శుక్రవారం వస్తాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు తెలిపారు.

శరత్ చంద్రారెడ్డి:- జ్యూడిషియల్ రిమాండ్ లో వున్న శరత్ చంద్రారెడ్డికి బుక్స్, ఇంటి భోజనం ఇవ్వాలని  ఆయన  తరపు న్యాయవాదులు సీబీఐ న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. పుస్తకాలను మాత్రమే ఇచ్చేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.ఇంటి భోజనం కుదరదని స్పష్టం చేసిని న్యాయస్థానం,ఒక వేళ డాక్టర్లు సూచిస్తే మాత్రం అలాంటి భోజనం కూడా జైలు వంటగదిలో తయారుచేసి అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *