ఇ క్రాప్ ప్రక్రియ సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జిల్లాలో పూర్తి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: ఇ-క్రాప్ పై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి, పంట సీజన్ మొదలైన వెంటనే ప్రతి రైతు ఇ-క్రాప్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు..శనివారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది..జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతు సమస్యలపై సకాలంలో స్పందిస్తూ, రైతులకు మెరుగైన సేవలందించాలన్నారు.ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కొద్ది రోజ్జుల్లో వరి కోతలు ప్రారంభం కానున్న దృష్ట్యా, వ్యవసాయ, పౌరసరఫర, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనులుకు సంబందించి రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమంలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు. ఇ క్రాప్ ప్రక్రియను సెప్టెంబర్ 5వ తేదీ నాటికి జిల్లాలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ లో వున్న పంట సాగు హక్కు పత్రాలను కౌలు రైతులకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కౌలు రైతులందరికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలనికలెక్టర్, ఎల్.డి.ఎం ను ఆదేశించారు.