మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన ఈసీ

అమరావతి: ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది.. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12వ తేది,, మేఘాలయ అసెంబ్లీ, మార్చి 15వ తేది,, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22వ తేదితోనూ ముగియనున్నాయి..బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు.. నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు వంతున ఉన్నాయి..త్రిపురలో ఫిబ్రవరి 16వ తేదిన ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు..మేఘాలయలో ఫిబ్రవరి 27వ తేదిన పోలింగ్ జరుగుతుందని,,నాగాలాండ్‌లో కూడా ఫిబ్రవరి 27వ తేదినే పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు..ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదిన వెలువడతాయని తెలిపారు..ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ (cVigil app) ద్వారా ఎన్నికల కమిషన్ (ECI)కి తెలియజేయవచ్చునని,, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామన్నారు..ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.