దేశంలో ఎక్కడి నుంచి అయిన ఓటు వేసేందుకు ప్రణాళికల సిద్దం చేస్తున్న ఎన్నికల సంఘం

అమరావతి: ఉద్యోగల రీత్యా,,జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు,తమ సొంత నియోజక వర్గాల్లో ఓటింగ్ లో పాల్గొన్నడం లేదన్న విషయం ఎన్నికల కమీషన్ గుర్తించింది..2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది..అప్పట్లో దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలింది..వీరంతా బయటి ప్రాంతాల్లో స్థిరపడ్డ వారే అని, వీరు ఓటింగ్ లో పాల్గొనేలా ఎన్నికల కమీషన్ రిమోట్ ఓటింగ్ మెషిన్ ను అభివృద్ధి చేసింది..ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లకుండానే ఓటు వేసేలా ప్లాన్ చేస్తోంది..జనవరి 16వ తేదిన రాజకీయ పార్టీలకు “డెమో” ఇచ్చేందుకు ఈసీ సిద్ధమైంది..ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిమోట్ వోటింగ్ మిషన్ డెమోకు హాజరుకావాలని ఆహ్వానం పంపింది. లీగల్,,అడ్మినిస్ట్రేటివ్,, టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రిమోట్ ఓటింగ్ సిస్టమ్ అమలుపై ముందుకెళ్లాలని ఈసీ భావిస్తోంది..ఈ కొత్త ఓటింగ్ మిషన్ తో ఒక పోలింగ్ బూత్ నుంచి 72 వేర్వేరు నియోజకవర్గాలను కవర్ చేసేలా రూపొందించారు. రాజకీయ పార్టీల అంగీకారం తర్వాత ఈ ఇష్యూపై ఈసీ ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని సమాచారం..మరి రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం వెల్లడిస్తాయో వేచి చూడాలి..
Election Commission of India (ECI) develops prototype Multi-Constituency Remote Electronic Voting Machine (RVM) which can handle multiple constituencies from a single remote polling booth. So, migrant voters need not travel back to their home states to vote: ECI pic.twitter.com/KixvzEEzmq
— ANI (@ANI) December 29, 2022