కోర్టులో జరిగిన దొంగతనం కేసును సిబిఐకి అప్పగిస్తు అదేశాలు జారీ చేసిన హైకోర్టు

నెల్లూరు: జిల్లాకోర్టులో ఫైళ్ల మాయమైన కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఫైళ్ల మాయమైన కేసు సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది.నెల్లూరు జిల్లాకోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏప్రిల్ 13న అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల ఆస్తులున్నయని,2017లో ప్రస్తుత వ్యవసాయశాఖా మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి ఆరోపణలు చేశారు.కాకాణి నాడు చూపించిన పత్రాలు నకిలీవంటూ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తొంది.ఏప్రిల్ 13వ తేదిన కోర్టులో దొంగ చొరబడి,కొన్ని వస్తువులు,ఫైళ్లను చోరీ చేశారు.ఇందులో కేసుకు సంబంధించి కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వున్నాయి.మరుసటి రోజు ఉదయం, దొంగతనం జరిగినట్లు గుర్తించిన కోర్టు సిబ్బంది, చిన్నబజార్ పోలీసు స్టేషన్ కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయిని ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగతనం కేసుకు సంబంధించి అప్పటి సదరు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి జరిగిన సంఘటనపై సవివరమైన నివేదిక ఇచ్చారు.నివేదికలో పలు అనుమానాలు వ్యక్తం చేసిన సదరు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ జడ్జి..ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయలేదని,నిందితులు పగలకొట్టిన తలుపులపై వేలిముద్రలు,పాదముద్రలు సేకరించలేదని నివేదికలో పేర్కొన్నటూ సమాచారం. ఈ నివేదికను సుమోటాగా తీసుకున్న విచారణ జరిపిన హైకోర్టు నేడు ఈ ఫైళ్ల మాయం కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది.