రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది.. హైకోర్టుకు వెళ్లే రహదారి సరిగా లేదని,,కనీసం వీధి లైట్లు కూడా వెలగడం లేదని,,రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..ఈ పిటీషన్ పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది..అయితే 2 నెలల్లో పూర్తి కావని 3 నెలలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్దించారు..కానీ కోర్టు మాత్రం 3 నెలలు కుదరదు 2 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది..కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోతే ఎలా? దీనికి కూడా గడువు కావాలా? అంటూ కోర్టు అసహనం వ్యక్తంచేసింది.