జాతీయ జెండా రూపకర్తల జీవితాలు మనందరికీ ఆదర్శం,స్పూర్తిదాయకం-చలమయ్య

నెల్లూరు: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, నాటక రంగ అభివృద్దికి హర్నిశలు కృషి చేసిన మహనీయులు బళ్ళారి రాఘవ గార్ల జీవితాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కార్పొరేషన్ మేయర్ శ్రీమతి స్రవంతి పేర్కొన్నారు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్–హర్ ఘర్ తిరంగా ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల జయంతి సంధర్బంగా వారి చిత్రాపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. స్వాతంత్ర్య సమర యోధులు కె.వి.చలమయ్య మాట్లాడుతూ, ఈ రోజు ప్రత్యేకమైన రోజని, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ గార్ల జయంతిని జరుపుకోవడం మన అదృష్టమని, ప్రపంచం ఉన్నంత కాలం వారిని స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ త్యాగమూర్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు..