ప్రధాని నరేంద్రమోదీతో చాలా ప్రత్యేక పరిస్థితుల్లో సమావేశం కావడం జరిగింది-పవన్

విశాఖపట్నం: చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీని కలవడం జరిగిందని,రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను అయనకు తెలియచేడం జరిగిందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.శుక్రవారం ప్రధాని మోదీని INS చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)లో సమావేశమైన అనంతరం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు రెండు రోజుల క్రితం పీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని పవన్ చెప్పారు. ప్రధాని మోదీని దాదాపు 8 సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడే కలవడం జరిగిందన్నారు.రాష్ట్రం అభివృద్ది జరగాలన్నదే తన అకాంక్ష అని అన్నారు.విలేఖర్లు పలు ప్రశ్నలు అడుగుతున్న సందర్బంలో అన్ని విషయాలను తరువాత తెలియచేస్తానంటూ క్లుప్తంగా ముగించారు.