x
Close
HYDERABAD MOVIE

అభిమాని కష్టం తెలుసుకుని తక్షణమే స్పందించిన మెగాస్టార్

అభిమాని కష్టం తెలుసుకుని తక్షణమే స్పందించిన మెగాస్టార్
  • PublishedAugust 16, 2022

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తనకు తెలిసిన వాళ్లకు కష్టలు వస్తే,తనకు వీలైనంతో సహాయం అందిస్తారు.అందులో తన అభిమానుకు అయితే తక్షమే స్పందిస్తారు అనేందుకు ఎన్నొ ఉదహారణలు వున్నా,,ప్రస్తుతం చక్రధర్ అనే అభిమానికి తన వంతు సహాయం అందిస్తున్నారు..వివరాల్లోకి వెళ్లితే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో నివాసం ఉండే దొండపాటి చక్రధర్,, మెగాస్టార్ కు వీరాభిమాని..తన అభిమాన హీరో బాటలోనే తన వంతుగా ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్నారు..దురదృష్ట కొద్ది అయనకు క్యాన్సర్ వ్యాధి సోకింది..గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు..ఈ విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రప్పించారు..ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు.. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు..అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు..అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.