అమరావతి: హర్యానాలోని పచగావ్ పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన జరిగింది..అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌పై మైనింగ్ మాఫియా ఆయనపై ట్రక్కు ఎక్కించి హతమార్చింది..ఈ సంఘటనలో బిష్ణోయ్ అక్కడికకక్కడే మృతిచెందారు..రాతి గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై డీఎస్‌పీ సురేంద్ర సింగ్ విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా తావడూ సమీపంలోని పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. దారిలో వెళ్తున్న ఓ లారీని ఆపేందుకు డీఎస్‌పీ ప్రయత్నించారు.. ట్రక్కు డ్రైవర్ వేగంను తగ్గించ కుండా,ఇంకా వేగం పెంచి వీరి వాహానంపైకి వచ్చాడు.డీఎస్పీతో పాటు వున్న గన్ మోన్,,డ్రైవర్లు వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు. ట్రక్కు ఢీకొట్టిన వెంటనే డీఎస్పీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసుల పేర్కొన్నారు.. ఈ సంఘటనపై సౌత్ రేంజ్ ఐజీపీ రవి కిరణ్ మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ సమాచారం అందగానే బిష్ణోయ్ ఆకస్మికంగా తనిఖీకి వచ్చారని, తగిన బందోబస్తు లేకుండా వెళ్లకూడదని, అయితే అందుకు ఆయనకు సమయం లేకపోయి ఉండవచ్చని అన్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపులు చేప్పటినట్లు పేర్కొన్నారు..హర్యానా ముఖ్యమంత్రి ఖట్టార్:-డీఎస్‌పీ హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టార్ ఒక ప్రకటనలో తెలిపారు..డీఎస్‌పీ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు..ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, అమరవీరునిగా గుర్తిస్తామని తెలిపారు..
(1994లో హరియాణా పోలీసు విభాగంలో చేరారు సురేంద్ర సింగ్ బిష్ణోయ్. అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన ఆయన.. క్రమంగా డీఎస్‌పీ స్థాయికి ఎదిగారు.)
DSP Taoru Sh Surender Singh laid down his life today in the course of duty. #HaryanaPolice extends its deepest condolences to the bereaved family of the brave officer. No effort shall be spared in bringing the offenders to face justice.
…@cmohry— Haryana Police (@police_haryana) July 19, 2022