అమరావతి: ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కొవిడ్ కేసులు నమోదు కానప్పటికీ,,2023 జనవరి నెల మధ్య కాలం నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నదని, బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలే ఈ విషయాన్ని వెల్లడించాయి. గతంలో కొవిడ్ విజృంభించిన తీరును బట్టి వచ్చే జనవరి నెల మధ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న 40 రోజులు చాలా కీలకమని తెలిపాయి..అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితిని అదుపు చేసేందుకు ఏర్పాట్లు చేశారు..బుధవారం దుబాయ్ నుంచి తమిళనాడుకు వచ్చిన ఇద్దరిలో కరోనా పాజిటివ్ గుర్తించారు..చెన్నై ఎయిర్‌పోర్టులో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు..ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి.