అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం-చిరంజీవి

అమరావతి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు ఉత్సవాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోమవారం హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’(International Film Festival of India) పురస్కారాన్ని ప్రకటించిన విషయం విదితమే.సదరు పురస్కారాన్ని అందుకోవడానికి చిరంజీవి భార్య సురేఖతో కలసి గోవాలో జరుగుతున్న ఇఫీ ఉత్సవాలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం. ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఎదుగుతారు.నాకు యువ హీరోలు పోటీ కాదు,,నేనే వాళ్లకు పోటీ. ప్రస్తుతం ప్రాంతీయ భేదాలు,అంతరాయలు లేవు,,ఇది భారతీయ సినిమా అనే రోజులు వచ్చాయి. భవిష్యత్తులో భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని అన్నారు.