అమరావతి: కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో వుంచుకుని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయ నిపుణులు,అధికారులతో బుధవారం పరిస్థితిని సమీక్షించారు.కోవిడ్ దశ ఇంకా పూర్తి స్థాయిలో ముగియలేదని,ఆప్రమత్తంగా వుంటూ నిఘాను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. భారతదేశంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నట్లు తెలిపారు.చైనా,అమెరికా తదితర దేశాల్లో వారానికి దాదాపు 35 లక్షల కేసులు వరకు నమోదు అవుతున్నయన్నారు..కొన్ని ముందస్తూ జగ్రత్తలు తీసుకొవడం ద్వారా కొత్త వేరియంట్ లను గుర్తించి,ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.
జూన్ లోనే కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది.వైరస్ కొత్త వేరియంట్ లను ఎప్పటికప్పడు గుర్తించడానికి పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర అరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు.కొవిడ్ పాజిటివ్ గా తేలిన నమూనాలను ప్రతి రోజు సార్స్ కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియం పరీక్షా కేంద్రాలకు పంపించాలని కోరారు.దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 4 వేలకు దిగువనే వున్నాయి.
భారతీయులు ఆందోళనచెందవలసిన:- చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపధ్యంలో అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళనచెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు..చైనా, ఇటలీలలో పరిణామాలను గుర్తించి, తక్కువగా సిద్ధమవడం కన్నా మితిమీరిన సన్నద్ధత మంచిదని తాము గతంలో భావించామని, దానివల్ల మేలు జరిగిందని చెప్పారు. శాస్త్రవేత్తలు, క్లినిషియన్స్, విధాన రూపకర్తల మధ్య సమన్వయం ఉండటం వల్ల ఇది సాధ్యమైందని తెలిపారు.