AMARAVATHIDISTRICTS

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. ఉదయం నుంచి అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లలో ఓటర్లు బారులు తీరి పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు  9.51 శాతం, 11 గంటలకు 23.77 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 42.38 శాతం, మూడు గంటలకు 58.14 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 69.95 శాతంగా పోలింగ్ నమోదయింది. సాయంత్రం 6 గంటల తరువాత కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఓటేసేందుకు క్యూలైన్లు వేచి ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు అధికారులు ఓటు హక్కు కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 2470 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, వెబ్ కాస్టింగ్ ద్వారా నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *