ఓటర్ కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభం-సంయుక్త కలెక్టర్

నెల్లూరు: ఓటర్ కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తూ సంయుక్త కలెక్టర్ ఆర్. కూర్మానాధ్ గోడపత్రాన్ని ఆవిష్కరించారు..సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో స్పందన కార్యక్రమం సందర్బంలో అవిష్కరణ జరిగింది..అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఇందులో భాగంగానే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు..