గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ..
అమరావతి: 53 సంవత్సరాల నుంచి తాము కాంగ్రెస్ కోసం రక్తం ధారబోశామని,,ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కంప్యూటర్‌కు, ట్వీట్టర్‌కు మాత్రమే పరిమితం అయ్యిందని,, తమలాంటి వాళ్ల పార్టీ విడి బయటకు వస్తున్నరంటే,,రాహుల్ యువరాజు లాగా ప్రవర్తిస్తుండడమే కారణమంటూ గులాంనబీఆజాద్(73) మండిపడ్డారు.అదివారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన గులాంనబీ ఆజాద్, జమ్ములో భారీ రోడ్‌షో నిర్వహించారు.అనంతరం సైనిక్ కాలనీలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కొత్త పార్టీ పేరు,జెండా జమ్ముకశ్మీర్ ప్రజలే నిర్ణయించాలన్నారు..పార్టీ పేరు హిందుస్తాన్ ను ప్రతిబింబిస్తుందన్నారు.జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.రాష్ట్రంలో విద్యా,నిరుద్యోగులకు ఉపాధి అవకాశలపై దృష్టి పెడతామన్నారు..గులాంనబీ ఆజాద్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని,,బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు విన్పిస్తున్న నేపధ్యంలో,వాటికి సమాధానం ఇస్తు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండదని ఆజాద్ ప్రకటించారు.నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పీడీపీతో పొత్తు ఉంటుందని ప్రచారంపై అయన పెద్దగా స్పందించలేదు. గులాంనబీఆజాద్‌కు మద్దతుగా దాదాపు 100 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు.
#WATCH | Congress was made by us by our blood & sweat, not by computers, not by tweets. People trying to defame us but their reach is limited to computers & tweets: Former senior Congress leader Ghulam Nabi Azad in Jammu today pic.twitter.com/JfTJIFPEsS
— ANI (@ANI) September 4, 2022