మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి: మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది.. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది..రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది..CRDA చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్ లో పేర్కొంది..అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో తెలిపింది. CRDA ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువస్తోందని మండిపడుతున్నాయి.