పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తొంది-మంత్రి సురేష్

నెల్లూరు: దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి పేద కుటుంబం సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు..శనివారం ఆత్మకూరు పట్టణం, నెల్లూరు పాలెంలో 75.90 కోట్ల రూపాయలతో G ప్లస్ 3 విధానంలో నిర్మించిన వై.యస్.ఆర్ జగనన్న కాలనీని మంత్రి కాకాణితో కలసి ప్రారంభించి లబ్ధిదారులకు ఇంటి పత్రాలు, తాళాలు అందచేశారు..ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పేదలందరికి ఇల్లు పధకం కింద పట్టణ ప్రాంతంలో ఉన్న పేదల సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు..ఆత్మకూరు పట్టణంలో నిర్మించిన 1056 గృహాలను ఈ రోజు సంబందిత లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను, తాళాలను అందచేయడం జరుగుతుందని తెలిపారు..మరో మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజల సంక్షేమాన్నిదృష్టిలో వుంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. గత మూడు సంత్సరకాలంలో అవినీతికి తావులేకుండా కుల, మత,రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు..కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా వుంటూ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పధకాలను ప్రజల ముంగిటకే చేరవేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లాలో 3 వేల కోట్ల రూపాయలతో 32,464 పి.ఎం.ఎ.వై. ( పట్టణ) వై ఎస్ ఆర్ జగనన్న నగర్ టిడ్కో ఇళ్ళు నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి,,స్థానిక ఎమ్మేల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.