రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్టులో చుక్కెదురు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సమయంలో కేంద్రం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది..పిడి ఖాతాలకు మళ్ళించిన దాదాపు రూ.1100 కోట్ల కొవిడ్ నిధులను తిరిగి రెండు వారాల్లో SDRF ఖాతాలోకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం ఆదేశించింది..కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 4 వారాల్లో ఫిర్యాదును పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది..నిధులు వెనక్కి ఇవ్వడంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటామని న్యాయవాది అనగా.. అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది..దీనిపై తామే ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. కొన్ని కొవిడ్ బాధిత కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని న్యాయవాది, ధర్మాసనంకు తెలిచేయగా.. పరిష్కార కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది..