ఎన్నికల ఉచిత హామీలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అవి,,ఇవి ఇస్తామంటూ ఉచిత హామీలు ఇవ్వడంపై,సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..ఇలాంటి హామీలు ప్రమాదకరంగా అభివర్ణిస్తూ,,వీటిని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది..ఉచితాలు అంటూ రాజకీయ పార్టీలు హామీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.. దీనిపై జనవరి సోమవారం(25వ తేదీ) సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది..నేడు (మంగళవారం) దీనిపై విచారణ జరిపింది.. హామీలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయనే విషయాన్ని సుప్రీం గుర్తు చేసింది..ఉచితాలపై నిషేధం విధించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకరావాల్సి ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు..ఉచిత హామీలపై ఈసీనే ఓ నిర్ణయం తీసుకోవాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ తెలిపారు..రాతపూర్వకంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశ్నించారు.. ప్రభుత్వం తన వైఖరి తెలియచేస్తే,,వీటిని కొనసాగించడమా ? లేదా ? అనేది తాము నిర్ణయిస్తామని స్పష్టం చేశారు..సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారని,,దీనిని నియంత్రించడానికి ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించారు..రాజకీయ అంశాలు ఇమిడి ఉండడం వల్ల ఉచితాలపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదని అయన సమాధానం ఇచ్చారు..మొత్తం రూ.6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం వుందని,,భారతదేశం మరో శ్రీలంకగా మారే అవకాశాలు గోచరిస్తూన్నయని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వాదించారు..తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది..