AMARAVATHINATIONAL

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది..ఈ కమిటీలో కలెక్టర్లు,, పోలీసు ఉన్నతాధికారులనుకూడా నియమించాలని సూచించింది..4 రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్ లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని,, ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని,, అక్రమ ఇసుక తవ్వకాలను నిషేదించడానికి పెద్దఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.. ఫిర్యాదులకోసం టోల్ ఫ్రీ నెంబర్లు,,ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని,, తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తుంచుకుని విధులను నిర్వర్తించాలని,, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

          ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచార‌ణ జ‌రిపింది.. ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణచచ అటవీశాఖ దృవీకరించాయి.. ఈ మేర‌కు మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించాయి..దాదాపు రూ.10 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకెళ్లారు.. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాలతోసహా సుప్రీంకోర్టుకు అందించారు.. రాష్ట్ర ప్రభుత్వం,, కంపెనీలు ఉమ్మడిగా అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..

          కేంద్ర పర్యావరణ,, అటవీశాఖ అధికారులుకూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలని,, కేంద్ర అధికారులు సందర్శించే విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదని,,సమాచారంకూడా ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది..ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని,, ఇప్పటికే తీసుకున్న చర్యలను వివరిస్తూ, ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయ‌గా, ఆ వివరాలు కూడా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం మార్గదర్శకాలు జారీచేసింది.. జులై 9వ తేది లోపు కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని,, తదుపరి విచారణ జులై 15వ తదిన చేపడుతామని,, అప్పటి లోగా ఇతర వివరాలుకూడా కోర్టుకు అందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *