నోయిడాలోని ట్విన్ టవర్స్ను 9 సెకన్లలోనే కూల్చివేశారు

అమరావతి: ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని ట్విన్ టవర్స్ను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేశారు.. 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ ని 9 సెకన్లలోనే కూల్చి వేసేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగంచారు..నోయిడాలో ట్విన్ టవర్లను 100 మీటర్ల ఎత్తుతో రూ.70 కోట్ల ఖర్చుతో సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. చుట్టు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.అటు వైపు వున్న పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు..FDPS ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో కూల్చే వేసేందుకు 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు వంతున పని చేశారు..300కు పైగా CCTV కెమెరాలతో పనులను పర్యవేక్షించారు.. రెండు భవనాల్లో 9,600 రంధ్రాలు చేసి 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేసి,,రెండు టవర్లలో డిటోనేటర్లకు పవర్ సప్లై కోసం 20 వేల కనెక్షన్లు ఇచ్చారు..టవర్లు కూలిన తరువాత దాదాపు 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగిలాయి.వీటిని తొలగించేందుకు దాదాపు మూడు నెలలు పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు..
#WATCH | 'Controlled implosion' turns Noida's #SupertechTwinTowers to dust pic.twitter.com/zDksI6lfIF
— ANI (@ANI) August 28, 2022