వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి-పవన్ కళ్యాణ్

డీజీపీ బాధ్యత తీసుకోవాలి..
హైదరాబాద్: వెంకటగిరి ఎమ్మేల్యే,మాజీ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి తనకు ప్రాణ హాని వుందని అందోళన చెందట చూస్తూంటే,,రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు..ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని,,ఈ ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు..లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాస్తానని హెచ్చరించారు..ప్రజా జృవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా రాజకీయాలకు పేరెన్నికెగన్న ఆయన ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన ప్రజాప్రతినిధుల పరిస్థితేంటి? శాసన సభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి..మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది..ప్రభుత్య వ్యవహార శైలి గురించి, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై ఆనం రామనారాయణరెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు..అయితే దీనిని ప్రభుత్వ పెద్దలు నేరంగా భావిస్తున్నారు..ఆయనకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు..సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోంది..అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు ? రామనారాయణ రెడ్డి చేసిన ప్రాణ హాని ప్రకటన, కోటం శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని పవన్ డిమాండ్ చేశారు.