హైదరాబాద్: పర్యాటక శాఖ మంత్రి అంటే మీరు పర్యటనలు చేయడం కాదు,,పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని రోజాకు సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సూచించారు..చిరంజీవి, పవన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు..రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదని ఘాటుగా విమర్శించారు..రోజా బాధ్యత మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు..దేశ స్థాయిలో టాప్ 20 ర్యాంకింగ్స్ లో ఏపీ పర్యాటక శాఖ 18 స్థానంలో ఉందన్నారు..రాష్ట్ర పర్యాటక శాఖ వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా,, పరోక్షంగా జీవిస్తున్నరని,,మంత్రిగా నీ చేష్టల వల్ల వారి బ్రతుకులు మరింత దిగజారిపోతున్నాయని పేర్కొన్నారు. పనికి మాలిన విమర్శలు మాని,,పర్యాటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని హితవు పలికారు..
రోజా @RojaSelvamaniRK
నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023